Breaking News

‘లేరని ఊహించుకోవడం చాలా కష్టం’

Published on Thu, 10/10/2024 - 10:28

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. టాటా అస్తమయం ఆత్మీయులకు తీరనిలోటు. టాటా కన్నుమూశారనే వార్త విని ఒకప్పటి సినీనటి సిమి గరేవాల్ తన ఎక్స్‌ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. గతంలో ఈమెతో రతన్‌టాటా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కాలంలో ఆమె వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

సిమీ గరేవాల్‌ స్పందిస్తూ..‘మీరు వెళ్లిపోయారనే వార్త విన్నాను. మీ లేరని ఊహించుకోవడం చాలా చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఆమె తన ఎక్స్‌ ఖాతాలో చేసిన పోస్ట్‌ ద్వారా సంతాపం తెలిపారు. ఒక సమావేశంలో టాటా మాట్లాడుతూ తాను నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, పెళ్లికి దగ్గరగా వచ్చానని తెలిపారు. కానీ కొన్ని సంఘటనల వల్ల పెళ్లి చేసుకోలేదని చెప్పారు. ‘భార్య, కుటుంబం లేకపోవడంతో చాలాసార్లు ఒంటరిగా గడిపాను. కొన్నిసార్లు అందిరిలాగే భార్య, పిల్లలు, కుటుంబం ఉండాలని ఆశపడ్డాను. మరికొన్నిసార్లు వేరొకరిపై ఆధారపడడంతో వచ్చే ఆందోళనల గురించి చింతించకుండా స్వేచ్ఛగా ఉండాలని అనుకున్నాను’ అని చెప్పారు.

నువ్వు లేవంటున్నారు..కష్టంగా ఉంది.. రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగం

రతన్ టాటా అమెరికాలో ఉన్నపుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తైన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకు రావలసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియా రావడానికి సిధ్ధ పడింది. కానీ, అదే సమయంలో ఇండియా-చైనాకు యుద్ధం జరుగుతుండడంతో ఆమె భయపడి ఇండియా రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి తనను కలవలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మంచితనంలో అపరకుబేరుడు

ప్రజల సందర్శన కోసం టాటా భౌతికకాయం

రతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)లో ఉంచనున్నారు .

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)