Breaking News

మళ్లీ వెండి వేడి

Published on Tue, 02/10/2026 - 05:46

న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్‌చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి. స్థానిక బులియన్‌ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాములు రూ. 1,300 బలపడింది. రూ. 1,58,500ను తాకింది. వారాంతాన వెండి కేజీ రూ. 2,55,000 వద్ద, పసిడి 10 గ్రాములు రూ. 1,57,200 వద్ద నిలిచిన విషయం విదితమే.

 ధరల తాజా పెరుగుదలకు యూఎస్‌ డాలరు బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ పుంజుకోవడం కారణమైనట్లు బులియన్‌ వర్గాలు తెలియజేశాయి. అంతేకా కుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితికితోడు.. యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తీసుకుంటున్న అనూహ్య రాజకీయ, భౌగోళిక చర్యలు వెండి, పసిడి తదితర విలువైన లోహాలకు డిమాండును పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకులు సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. 

విదేశీ మార్కెట్లో
 అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్‌ స్పాట్‌ ధర ఔన్స్‌ 2.8 శాతం(2.2 డాలర్లు) ఎగసింది. 80.21 డాలర్లను తాకింది. మరోపక్క పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 1 శాతం పుంజుకుని 5,013 డాలర్లకు చేరింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)