Breaking News

వెండి ఆభరణాలకూ హాల్‌ మార్కింగ్‌

Published on Tue, 01/07/2025 - 05:58

న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్‌ మార్కింగ్‌ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను (బీఐఎస్‌) కోరినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. ‘బంగారం మాదిరే వెండికీ హాల్‌ మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ వినియోగదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 

దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి’ అని బీఐఎస్‌ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి జోషి కోరారు. ఈ దిశగా కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టిందని చెప్పారు. ‘అమలు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, వినియోగదారులు, ఆభరణాల డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరాను. భాగస్వాములు అందరితో మాట్లాడిన తర్వాతే ప్రక్రియ మొదలు పెడతాం’అని తెలిపారు. కాగా, మూడు నుంచి ఆరు నెలల్లో వెండికి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)