Breaking News

అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్‌!

Published on Thu, 11/09/2023 - 16:58

ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 

అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్‌ ఫౌండర్‌, చైర్‌పర్సన్‌, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా.

అది వెర్రితనం
‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా.  

వారానికి 70 గంటలు పనికే కేటాయి​స్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్‌ఫోర్స్‌లో చాలా మంది మహిళలకు వర్క్‌తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు.  

యువత ఆఫీస్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.  ఒక యజమానిగా తాను అవుట్‌పుట్‌పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు