Breaking News

ఉద్యోగం పోయాక బంపరాఫర్.. డబుల్ శాలరీతో కొత్త జాబ్!

Published on Thu, 06/18/2026 - 17:32

ఉద్యోగం కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు, సదరు వ్యక్తి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది. చాలా మందికి జీవితంలో ఒక పెద్ద షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. అలాంటి అనుభవాన్నే ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.

దాదాపు నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, తక్కువ జీతంతో కొనసాగుతున్నప్పటికీ.. సంస్థ పట్ల చాలా విధేయతతో వ్యవహరించాడు. అయితే కంపెనీ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయాల ప్రకారం.. అతను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.70 వేల జీతం పొందేవాడు. నాలుగున్నరేళ్ల సేవ చేసినప్పటికీ సరైన వేతన పెంపులు లేకపోవడంతో అదే జీతం వద్ద కొనసాగాడు. ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఉద్యోగ విరమణ పరిహారం చెల్లింపు విషయంలో హెచ్‌ఆర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని వెల్లడించాడు.

అయితే ఆశ్చర్యకరంగా, తన చివరి పని రోజునే మరో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం కూడా నెలకు రూ.1.58 లక్షలు అని వెల్లడించాడు. దీంతో అతని ఆదాయం ఒక్కసారిగా రెండింతలకు పైగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తగ్గినట్లు పేర్కొన్నాడు. జీతం ఒక్కసారిగా అంత పెరుగుతుందని ఊహించలేదని ఉద్యోగి చెప్పాడు. ఇది కలలా అనిపిస్తోందని అన్నాడు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. వేలాది మంది దీనిపై స్పందిస్తూ ఉద్యోగికి శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది 'ఉద్యోగంలో విధేయత కంటే నైపుణ్యానికి సరైన విలువ దక్కే చోటుకు మారడం మంచిది' అని సూచించారు. ఒక నెటిజన్ 'ప్రతి రెండు లేదా రెండున్నరేళ్లకు ఉద్యోగం మార్చడం మంచిది. విధేయతకు ఈ రోజుల్లో పెద్దగా విలువ లేదు' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'నేను కూడా రూ.50 వేల జీతం నుంచి ఉద్యోగం మారి ఇప్పుడు రూ.1.1 లక్షలు పొందుతున్నాను' అని తెలిపారు.

ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)