Breaking News

నయారా బాటలో షెల్‌ ఇండియా!

Published on Wed, 04/01/2026 - 15:16

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

బెంగళూరులో ధరల మోత
తాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్‌ కంపెనీ అవుట్‌లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.

ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధర
పెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85
డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52

అంతర్జాతీయ సంక్షోభం
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలు
ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)