Breaking News

ఆఫీస్‌ స్పేస్‌ లీజులో హైదరాబాద్‌ టాప్‌

Published on Sat, 09/30/2023 - 06:40

బెంగళూరు: ఆఫీస్‌ స్పేస్‌ లీజు (కార్యాలయ వసతి) పరంగా హైదరాబాద్‌ మార్కెట్‌ మంచి వృద్ధిని చూపించింది. జూలై–సెపె్టంబర్‌ కాలంలో స్థూల లీజు పరిమాణం ఏకంగా రెండున్న రెట్లు పెరిగి 2.5 మిలియన్‌ చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒక మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజు సెపె్టంబర్‌ త్రైమాసికంలో 2 శాతం వృద్ధితో 13.2 ఎస్‌ఎఫ్‌టీగా నమోదైనట్టు కొలియర్స్‌ ఇండియా తెలిపింది.

ఇందుకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది.  క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజు పరిమాణం 12.9 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. స్థూల లీజు పరిమాణంలో లీజు రెన్యువల్, ఆసక్తి వ్యక్తీకరణపై సంతకం చేసిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు డిమాండ్‌ పెరిగినట్టు కొలియర్స్‌ ఇండియా నివేదిక తెలిపింది.

పట్టణాల వారీగా..
► బెంగళూరులో స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజు (తాజా) సెపె్టంబర్‌ క్వార్టర్‌లో 3.4 మిలియన్‌ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని 4.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీతో పోలిస్తే తగ్గింది.  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కట్లోనూ స్థూల లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.3 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 3.2 మిలియన్‌ చదరపు అడుగులకు క్షీణించింది.
► ముంబైలో స్పల్ప వృద్ధితో 1.6 మిలియన్‌ నుంచి 1.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
► చెన్నైలో ఒక మిలియన్‌ నుంచి 1.4 మిలియన్‌కు, పుణెలో 0.6 మిలియన్‌ నుంచి ఒక మిలియన్‌ చదరపు అడుగులకు స్థూల ఆఫీస్‌ స్పేస్‌ లీజు వృద్ధి చెందింది.


ఇదే ధోరణి కొనసాగొచ్చు..  
‘‘భారత ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెపె్టంబర్‌) 2022లో మాదిరే ఉంది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడం ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌కు మద్దతునిచి్చంది. ఇదే ధోరణి చివరి త్రైమాసికంలోనూ (అక్టోబర్‌–డిసెంబర్‌) కొనసాగొచ్చు’’అని కొలియర్స్‌ ఇండియా ఎండీ పీయూష్‌ జైన్‌ తెలిపారు. 2022లో నమోదైన చారిత్రక ఆఫీస్‌ స్పేస్‌ లీజు రికార్డు 2023లో అధిగమిస్తుందేమో చూడాలన్నారు. చివరి త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలో డిమాండ్‌ బలంగా ఉంటుందని కొలియర్స్‌ ఇండియాకు చెందిన అరి్పత్‌ మెహరోత్రా పేర్కొన్నారు. బెంగళూరు దేశ ఆఫీస్‌ సేŠప్స్‌ లీజులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)