Breaking News

న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ..

Published on Fri, 12/22/2023 - 18:57

2023 ప్రారంభం నుంచి మొదలైన లేఆప్స్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'షేర్‌చాట్' (ShareChat) తన ఉద్యుగులలో సుమారు 15 శాతం మందిని తొలగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023లో కంపెనీ నష్టాలను చవి చూడటం వల్ల ఖర్చులను క్రమబద్ధీకరించడానికి, ప్రస్తుతం 15 శాతం లేదా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది 4.9 బిలియన్స్ ఉన్న కంపెనీ విలువ ఈ సంవత్సరం 1.5 బిలియన్స్ తగ్గినట్లు సమాచారం.

షేర్‌చాట్ తన కార్యకలాపాలను, ఉత్పాదకతను మెరుగుపరచడం, స్థిరమైన వృద్ధికి స్థానం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, 2024 వార్షిక ప్రణాళికలో భాగంగా.. కంపెనీ వ్యూహాత్మక పునర్నిర్మాణాన్ని వివరిస్తూ షేర్‌చాట్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!

ఇండియన్ స్టార్టప్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాని వాల్యుయేషన్ సగానికి పైగా తగ్గడంతో నష్టాల్లో సాగింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కూడా సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఇప్పుడు సంవత్సరాంతంలో కూడా ఉద్యోగులను తొలగించి వారికి పెద్ద షాక్ ఇచ్చింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)