Breaking News

సీపీఐ పుష్‌.. మార్కెట్‌ రికార్డ్స్‌

Published on Fri, 06/14/2024 - 03:36

ముంబై: గత నెలలో సీపీఐ ఆర్‌బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్‌ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. 

ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! 

రియల్టీ అప్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్‌ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్‌ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్‌టీఐఎం, ఇండస్‌ఇండ్, టెక్‌ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్‌ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్,  యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. 

మార్కెట్‌ క్యాప్‌ @ 431.67 లక్షల కోట్లు 
ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్‌ డాలర్లు)  అధిగమించింది.  

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)