Breaking News

షేర్‌ బైబ్యాక్‌ల జోరు.. ఇన్వెస్టర్లకు కొత్త ఊపు!

Published on Sat, 05/02/2026 - 18:48

గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గిపోయిన షేర్ల బైబ్యాక్‌ కార్యకలాపాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉండే విధంగా పన్నుల విధానాలను క్రమబద్ధీకరించడంతో ఇవి ఆకర్షణీయంగా మారాయి. దీంతో అరబిందో ఫార్మా, సైయెంట్, విప్రోలాంటి కంపెనీలు బైబ్యాక్‌ ప్రణాళికలను ప్రకటించాయి.

గత కొన్నాళ్లుగా బైబ్యాక్‌లలో షేర్లను విక్రయించడంపై వచ్చిన లాభాలను, డీమ్డ్‌ డివిడెండ్లుగా పరిగణించి, శ్లాబ్‌ రేట్ల ప్రకారం పన్ను వేస్తుండటంతో ఇన్వెస్టర్లలో వీటిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు. అయితే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్స్‌ యాక్ట్‌ 2026 చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం, ఇన్వెస్టర్లకు సానుకూలంగా,  హేతుబద్ధతతో వీటిని షేర్‌హోల్డర్ల చేతిలో క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణిస్తుండటంతో బైబ్యాక్‌లు కాస్త ఆకర్షణీయంగా మారుతున్నాయి. కంపెనీల నుంచి బైబ్యాక్‌ ప్రతిపాదనలు వెల్లువెత్తడానికి ఈ పన్నుపరమైన ప్రయోజనాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.

రెండేళ్లుగా డౌన్‌..
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బైబ్యాక్స్‌ గణనీయంగా పడిపోయాయి. 2024–25లో కేవలం రూ. 8,034 కోట్లు, 2025–26లో రూ. 19,500 కోట్లకు పరిమితమయ్యాయి. అదే పన్ను విధానాలు సానుకూలంగా ఉన్నప్పుడు 2023–24లో వీటి పరిమాణం ఏకంగా రూ. 50,750 కోట్లుగా నమోదైంది.

వ్యాపారంపై ధీమా..
కేవలం ట్యాక్స్‌ ప్రయోజనాల వల్లే కాకుండా ఇతర అంశాలూ బైబ్యాక్‌కి ఊతమిస్తున్నాయి. చాలా మటుకు స్టాక్స్‌ భారీగా కరెక్షన్‌కి లోనవడం, నిధులు పుష్కలంగా ఉన్న కంపెనీలు తమ స్టాక్స్‌ని చాలా చౌకగా కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండు అంశాలే కాకుండా కంపెనీలు బైబ్యాక్‌లను చేపట్టడమనేది తమ ప్రధాన వ్యాపారాలపై కంపెనీలకి గల నమ్మకాన్ని సూచిస్తోందని నిపుణులు చెప్పారు. తమ షేర్లు ఉండాల్సిన విలువ కన్నా తక్కువ పలుకుతున్నా, ఈపీఎస్‌ (షేరువారీ ఆర్జన), రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) మెరుగుపడే కొద్దీ రేటు మరింత పెరుగుతుందని సంస్థలు ధీమాగా ఉండటాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.

భారీగా రాబడులిచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్న కంపెనీల విషయానికొస్తే, నగదును పక్కన పెట్టుకుని కూర్చోవడానికి బదులు బైబ్యాక్‌ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వేల్యుయేషన్లను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌ రూపంలో కొనుక్కునే వెసులుబాటును తిరిగి ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తున్న నేపథ్యంలో ఈ విధానం మళ్లీ ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నారు.

#

Tags : 1

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)