Breaking News

చరిత్ర మరువదు.. మీ ఘనత

Published on Fri, 10/11/2024 - 06:27

ముంబై: ‘‘ఈ స్నేహంలో అగాధం ఇప్పుడు నాతో ఉండిపోయింది. నా మిగిలిన జీవిత కాలంలో దీన్ని పూరించేందుకు కృషి చేస్తాను’’అంటూ శంతను నాయుడు తన స్పందనను వ్యక్తం చేశారు. 31ఏళ్ల ఈ యువకుడు రతన్‌టాటాకు అత్యంత విశ్వసనీయ సహచరుడు. 

వృద్ధాప్యంలో ఆయన బాగోగులు చూసుకున్న ఆప్త మిత్రుడు. రతన్‌టాటా అంతిమయాత్ర వాహనం ముందు యెజ్డీ మోటారుసైకిల్‌ నడుపుతున్న శంతనునాయుడిని చూసే ఉంటారు. ‘‘దుఃఖం అనేది ప్రేమకు చెల్లించాల్సిన మూల్యం. గుడ్‌బై, నా ప్రియమైన దీపస్తంభం’’అంటూ చిన్న పోస్ట్‌ పెట్టాడు. టాటా గ్రూప్‌లో ఐదవ తరం ఉద్యోగి శంతనునాయుడు. 2014లో రతన్‌టాటా, శంతను కలుసుకున్నారు. వీధి శునకాల పట్ల ప్రేమ వీరిద్దరినీ కలిపిందని చెప్పుకోవాలి. 

వీధి శునకాలు రాత్రి వేళల్లో వాహన ప్రమాదాలకు గురి కాకుండా, వాటి కోసం మెరిసే కాలర్లను శంతను డిజైన్‌ చేశాడు. కుక్కల మెడలో ఈ కాలర్‌ను ఉంచితే, రాత్రివేళ వాహన వెలుగులకు మెరవడంతో డ్రైవర్లు వాటిని గుర్తిస్తారన్నది అతడి యోచన. ఇందుకు నిధుల సాయం కావాలంటూ రతన్‌టాటాకు లేఖ రాశాడు. ముంబైలోని తన కార్యాలయానికి రావాలని, తనతో కలసి పనిచేయాలంటూ రతన్‌ టాటా నుంచి శంతనుకు పిలుపు వచి్చంది.

 రతన్‌టాటా సహకారంతో మోటోపాస్‌ అనే కంపెనీని శంతను స్థాపించాడు. వృద్ధులకు తోడుగా యువ సహచరులను కలిపే స్టార్టప్‌ ‘గుడ్‌ ఫెలోస్‌’ను సైతం స్థాపించాడు. ఆ తర్వాత ఎంబీఏ కోసం యూఎస్‌ వెళుతూ. తిరిగి వచి్చన తర్వాత కలసి పనిచేస్తానని రతన్‌టాటాకు శంతను హామీఇచ్చాడు. తిరిగొచి్చన తర్వాత రతన్‌టాటా అసిస్టెంట్‌గా, టాటా ట్రస్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. రతన్‌టాటా తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెన్నంటి ఉన్నాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)