షారూఖ్‌ ఖాన్‌ చేతికి అరుదైన గోల్డ్‌ వాచ్‌.. ధర ఎంతో తెలుసా?

Published on Sun, 01/26/2025 - 18:47

బాలీవుడ్ సూపర్ స్టార్ 'షారుఖ్ ఖాన్' ముంబైలో జరిగిన ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించారు. ఆ సమయంలో ఆయన చేతికున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ అది ఏ బ్రాండ్ వాచ్ అని చాలామంది సెర్చ్ చేయడం కూడా మొదలెట్టేసారు.

షారుఖ్ ఖాన్ చేతికున్న వాచ్.. ఆడేమర్స్ పిగుఎంట్ (Audemars Piguet) బ్రాండ్ అని తెలుస్తోంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఎందుకంటే ఇలాంటి వాచీలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 250 మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 76 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన షారుఖ్ ఖాన్.. నలుపు రెండు డ్రెస్సులో ఆకర్షణీయంగా కనిపించారు. ఈయన చేతికి ఖరీదైన వాచ్.. చెవికి ఇయర్ కఫ్ కూడా ధరించి ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాచ్ ప్రత్యేకతలు
షారుఖ్ ఖాన్ చేతికున్న ఆడేమర్స్ పిగుఎంట్ వాచ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది 18 క్యారెట్ల సాండ్ గోల్డ్‌తో తయారైనట్లు తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉంది.

షారుఖ్ ఖాన్ వాచ్ కలెక్షన్
నటుడు షారుఖ్ ఖాన్ వద్ద ఆడేమర్స్ పిగుఎంట్ బ్రాండ్ వాచ్ మాత్రమే కాకుండా.. పటేక్ ఫిలిప్ ఆక్వానాట్ క్రోనోగ్రాఫ్ 5968ఏ, పాటెక్ ఫిలిప్పే నాటిలస్ 58811/1జీ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ 2640ఐపీఓ, ఆడేమర్స్ పిగుయేట్ రాయల్ ఓక్ పర్ఫెటుల్ క్యాలెండర్, బెల్గరి ఆక్టో రోమా టూర్‌బిల్లాన్ సఫైర్ 103154, ట్యాగ్ హ్యూయర్  క్యాలిబర్ 1887 స్పేస్ఎక్స్, ట్యాగ్ మొనాకో సిక్స్టీ నైన్ సీడబ్ల్యు911 వంటి ఖరీదైన వాచీలు చాలానే ఉన్నాయి.

ఇదీ చదవండి: 80వేల కియా కార్లకు రీకాల్: కారణం ఇదే..

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)