Breaking News

ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్‌ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!

Published on Sat, 11/30/2024 - 13:42

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్‌ రెజక్ట్‌ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.

కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్‌డేట్‌ చేయాలి. లేదంటే క్లెయిమ్‌ నిలిపేసే అవకాశం ఉంటుంది.

తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్‌ఎస్‌సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.

యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్‌ అవుతుంది.

తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్‌ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.

పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్‌ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్‌ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్‌ రాదు.

కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్‌ తిరస్కరించే అవకాశం ఉంది.

#

Tags : 1

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)