Breaking News

జూన్‌లో సేవల వేగం డౌన్‌! 

Published on Thu, 07/06/2023 - 09:08

న్యూఢిల్లీ: భారత్‌ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వేగం మేతో పోల్చితే జూన్‌లో కొంత మందగించింది. మేలో 61.2 వద్ద ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్, జూన్‌లో 58.5కు తగ్గింది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.

ఈ ప్రాతిపదికన సూచీ 50పైన కొనసాగడం వరుసగా 23వ నెల. సూచీ తాజా సమీక్షా నెల్లో కొంత మందగించినప్పటికీ, వ్యవస్థలో డిమాండ్, కొత్త వ్యాపార పరిమాణాలు, ఉపాధి కల్పనకు సంబంధించి సానుకూల వాతావరణమే ఉన్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కిట్‌ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్‌ విభాగ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.

తయారీ, సేవలు కలిపితే... 
తయారీ, సేవల రంగాలు కలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ జూన్‌లో 61.6  వద్ద ఉంటే, మేలో 59.4కు తగ్గింది. ఈ సూచీ కూడా వృద్ధి ధోరణిలోనే పటిష్టంగా ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. భారత పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70% వాటా కలిగిన ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మేలో 31 నెలల గరిష్ట 58.7 స్థాయిని చూసిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ జూన్‌లో 57.8కి తగ్గింది. 400 తయారీ సంస్థల పర్చేజింగ్‌ మేనేజర్లకు పంపిన సమాధానాల ప్రాతిపదికన కదలికలు ఉంటాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)