Breaking News

రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జ్‌ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Published on Wed, 06/21/2023 - 11:41

పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్‌ చార్జ్‌ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్‌ చార్జ్‌ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది.

గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్‌లోని ఒక రెస్టారెంట్‌లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్‌ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్‌ వేసిన సర్వీస్‌ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్‌లతో దురుసుగా ప్రవర్తించారు.

మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్‌లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్‌లలో సర్వీస్‌ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా?
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్‌లు సర్వీస్ ఛార్జీలు  చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్‌ లేదా బార్‌లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు.

ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ రూ.30వేలకు మించితే క్లోజ్‌! నిజమేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)