Breaking News

వాహన టోకు విక్రయాలు పెరిగాయ్‌ 

Published on Fri, 10/17/2025 - 00:18

న్యూఢిల్లీ: జీఎస్‌టీ సంస్కరణ, పండుగ సీజన్‌ కలిసిరావడంతో తయారీదార్ల నుంచి డీలర్లకు ప్యాసింజర్‌ వాహనాలు, ద్వి చక్రవాహనాల సరఫరా గణనీయంగా పెరిగాయి. పెరిగిన టోకు విక్రయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ముగించవచ్చనే ఆశాభావంతో వాహన పరిశ్రమ ఉన్నట్లు సియామ్‌ పేర్కొంది. 

‘‘కొత్త జీఎస్‌టీ ధరలు సెపె్టంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చినప్పట్టకీ.., కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్యాసింజర్‌ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ విభాగాలు గతంలో ఎన్నడూ లేనంతగా సెపె్టంబర్‌లో అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 అమల్లోకి తీసుకురావడమనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆటో పరిశ్రమలో కాకుండా, మొత్తం ఆర్థికవ్యవస్థలో చైతన్యం తీసుకొస్తుంది’’ అని సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. 

→ కంపెనీలు సెపె్టంబర్‌లో డీలర్లకు 3,72,458 ప్యాసింజర్‌ వాహనాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే నెలలో పంపిణీ 3,56,752 యూనిట్లతో పోలిస్తే ఇవి 4% అధికం. 
→ ద్వి చక్రవాహన విక్రయాలు 7% వృద్ధి చెంది 21,60,889 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,25,993 టూ వీలర్స్‌ అమ్ముడయ్యాయి.  
→ త్రీ చక్రవాహన టోకు అమ్మకాలు 79,683 నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. 

త్రైమాసిక ప్రాతిపదికన....  
వార్షిక ప్రాతిపదికన క్యూ2లో 10.39 లక్షల పీవీ అమ్మకాలు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్‌ విక్రయాలు 7% వృద్ధి చెంది  55.62 లక్షల  యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రి చక్రవాహన విక్రయాలు 10% వృద్ది చెంది 2,29,239 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సెప్టెంబÆ    Š‡ త్రైమాసికంలో 2.4 లక్షల వాణిజ్య వాహన విక్రయాలు జరిగాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)