Breaking News

తొమ్మిదో రోజూ లాభాలే

Published on Fri, 04/14/2023 - 04:38

ముంబై: ఆఖర్లో బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ సూచీల ర్యాలీ తొమ్మిదోరోజూ కొనసాగింది. గడిచిన రెండేళ్లలో సూచీలు వరుసగా తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల కారణంగా ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 29 పాయింట్ల నష్టంతో 60,364 వద్ద మొదలైంది.

ట్రేడింగ్‌లో 405 పాయింట్ల పరిధిలో కదలాడి 60,081 వద్ద కనిష్టాన్ని 60,487 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 38 పాయింట్ల స్వల్ప లాభంతో 60,431 వద్ద ముగిసింది. నిఫ్టీ అయిదు పాయింట్లను కోల్పోయి 17,807 వద్ద 17,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,730 వద్ద కనిష్టాన్ని 17,842 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఇంధన, మీడియా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ 0.33%, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.16 శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 81.85 వద్ద స్థిరపడింది.విదేశీ ఇన్వెస్టర్లు రూ.222 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.274 కోట్ల షేర్లను అమ్మేశారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. శని, ఆది వారాలు సాధారణ సెలవు దినాలు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి సోమవారం యథావిధిగా ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.

‘‘టీసీఎస్‌ క్యూ4 ఆర్థిక ఫలితాల సందర్భంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ) పనితీరు, అవుట్‌లుక్‌పై యాజమాన్యం ఆందోళనకర వ్యాఖ్యలతో  దేశీయ ఐటీ రంగ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివచ్చినప్పటికీ.., బ్యాంకింగ్‌ సంక్షోభం కారణంగా మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చని ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ సూచించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)