More

వీకెండ్‌ ఉత్సాహం: ఆయిల్‌ & గ్యాస్‌ , మెటల్‌ షైన్‌

12 Aug, 2022 16:09 IST

వీకెండ్‌లో ఉత్సాహంగా  ముగిసిన సూచీలు

17700 కు చేరువలో నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వీకెండ్‌లో లాభాలతో ఉత్సాహంగా ముగిసాయి. వరుసగా రెండురోజుల లాభాలను వదులుకొని ఆరంభంలోనే 200 పాయింట్లు  కుప్పకూలిన సెన్సెక్స్‌  ఆ వెంటనే నష్టాలనుంచి కోలుకుంది. చివరికి సెన్సెక్స్‌ 130 పాయింట్లు ఎగిసి  59462 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి17698  వద్ద ముగిసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌ రంగ షేర్లు లాభపడ్డాయి.  ఫార్మా , ఐటీ నష్టపోయాయి.

ఆయిల్ & గ్యాస్ సూచీలు 2.5,  మెటల్ అండ్‌ పవర్ 1.5 శాతం పెరిగాయి. మరోవైపు, ఫార్మా ఇండెక్స్ 1 శాతం క్షీణించగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.76 శాతం పడిపోయింది. ఓఎన్‌జీసీ, టాటాస్టీల్‌, హిందాల్కో, ఎన్టీపీసీ, బీపీసీఎల్‌, యూపిఎల్‌, పవర్‌ గ్రిడ్‌ టాప్‌ గెయినర్స్‌గా  నిలిచాయి. అపోలో హాస్పిటల్స్‌,  దివీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా,  ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, మారుతి సుజుకి, నెస్లే నష్టపోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ  రూపాయి 8పైసలు క్షీణించి 79.7వద్ద ముగిసింది. 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టెక్‌ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్‌!

సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీ స్టాక్‌ సూచీలు

అంబులెన్స్‌కి కాల్‌ చేసి.. పోయే ప్రాణాలను నిలబెట్టిన స్మార్ట్‌వాచ్‌!

ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

ఆరోగ్యం కోసం వివిధ మార్గాలు - చాట్‌జీపీటీ సలహాలు