Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్‌ మనమే చెక్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Published on Tue, 01/02/2024 - 11:36

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్‌ చెక్‌ కియోస్క్‌, సెల్ఫ్‌ బ్యాగేజ్‌ డ్రాప్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్‌ ఇన్‌, బోర్డింగ్‌ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఈడీ ఎస్‌జీకే కిశోర్‌ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్‌ చెక్‌ కియాస్క్‌, సెల్ఫ్‌ బ్యాగేజ్‌ డ్రాప్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్‌ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్‌ ధర.. ఎంతంటే..

కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్‌ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్‌ పాస్‌, బ్యాగ్‌ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)