Breaking News

3 కంపెనీలు రెడీ

Published on Tue, 11/18/2025 - 04:57

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల దరఖాస్తులను ఆమోదించింది. ఈ జాబితాలో ఏస్‌వెక్టర్, సిల్వర్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్, స్టీల్‌ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ కంపెనీ చేరాయి. వీటిలో ఏస్‌వెక్టర్‌ 2025 జూలైలో గోప్యతా మార్గాన సెబీకి దరఖాస్తు చేసింది. సిల్వర్‌ కన్జూమర్, స్టీల్‌ ఇన్‌ఫ్రా ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి.

 ప్రస్తుత క్యాలండర్‌ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 92 కంపెనీలు మెయిన్‌బోర్డులో ఐపీవోకు వచ్చాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు ఈ నెలలోనే స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 3 కంపెనీలకు సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం! వివరాలు చూద్దాం.. 

స్నాప్‌డీల్‌ 
కునాల్‌ భల్, రోహిత్‌ బన్సల్‌ ఏర్పాటు చేసిన ఏస్‌వెక్టర్‌ రహస్య ఫైలింగ్‌ విధానంలో ఐపీవోకు అనుమతి పొందింది. ఇటీవల ఇదే మార్గంలో పలు దిగ్గజాలు పబ్లిక్‌ ఇష్యూ వచి్చన సంగతి తెలిసిందే. కాగా.. ఈకామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌ మాతృ సంస్థ అయిన ఏస్‌వెక్టర్‌.. సాస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికామర్స్‌సహా, కన్జూమర్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ సంస్థ స్టెల్లారో బ్రాండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో యూనికామర్స్‌ 2024లోనే లిస్టయిన సంగతి తెలిసిందే.  

పంపులు, ఫ్యాన్లు 
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సిల్వర్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 865 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు అనుబంధ సంస్థ బీఏపీఎల్‌ రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా పంపులు, మోటార్లు, ఫ్యాన్లు, లైటింగ్‌ తదితర కన్జూమర్‌ ఎలక్ట్రికల్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది.  

విస్తరణపై కన్ను 
స్టీల్‌ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 96 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.42 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వడోదర, హైదరాబాద్, భిలాయ్‌లలోగల తయారీ ప్లాంట్ల విస్తరణతోపాటు.. వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)