Breaking News

ఐదు నిమిషాల ఛార్జ్‌తో 482 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ

Published on Tue, 01/30/2024 - 10:53

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోని చాలా దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న కొత్త ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేదు, కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ఛార్జింగ్ కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.

ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి.. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధక బృందం ఓ సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే కావడం గమనార్హం. ఒక ఛార్జ్‌తో ఈ బ్యాటరీ 300 మైళ్లు లేదా 482 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో వినియోగంలో ఉన్న చాలా వాహనాలకు ఫాస్ట్ ఛార్జర్ అవకాశాలు ఉన్నప్పటికీ.. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే అమెరికన్ యూనివర్సిటీ బృందం రూపోంచిన బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవడం వల్ల వాహన వినియోగదారులకు సమయం చాలా ఆదా అవుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధిత కంపెనీలు నార్మల్ హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి గంటల సమయం పడుతుంది. ఇలాంటి వాహనాలను ఉపయోగించాలంటే వినియోగదారుడు ముందుగానే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ

అమెరికన్ పరిశోధక బృందం రూపొందించిన బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది, భారతదేశానికి ఈ బ్యాటరీలు వస్తాయా? వస్తే ఏ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తారనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది. వీటి గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నాము.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)