Breaking News

నమ్మకమైన రాబడులకు పెట్టుబడులు పెట్టే స్కీమ్..

Published on Mon, 01/08/2024 - 07:33

లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకం ఇది. గతంలో మిడ్‌క్యాప్‌ పథకంగా ఉండగా, సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్వ్యస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో.. లార్జ్, మిడ్‌క్యాప్‌ పథకంగా మారింది. లార్జ్, మిడ్‌క్యాప్‌ మధ్య పెట్టుబడులను వర్గీకరిస్తుంది. బీఎస్‌ఈ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నారు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలలో పెట్టుబడులకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. రాబడుల్లోనూ స్థిరత్వం ఉంటుంది. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెడతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పెట్టుబడుల విధానం
మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్‌ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018, 2020 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. ఆ సమయంలో ఈక్విటీల్లో గరిష్ట పెట్టుబడులు 94–96 శాతం మధ్యే పరిమితం చేసింది. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. స్టాక్స్‌ను కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు అందులో కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది.

రాబడులు
ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 25.66 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బీఎస్‌ఈ లార్జ్‌మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ రాబడులు కూడా ఇంచు మించు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల కాలంలో ఏటా 18 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 17.20 శాతం, పదేళ్లలో 21.83 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. బీఎస్‌ఈ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐతో పోలిస్తే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకంలోనే అధిక రాబడి ఉంది.

పోర్ట్‌ఫోలియో
ఈ పథకం 60–70 స్టాక్స్‌తో చక్కని వైవిధ్యాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం 67 స్టాక్స్‌ ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో 18,845 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 97.37 శాతాన్ని కేటాయించింది. నగదు, నగదు సమానాల్లో 2.63 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.58 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 32 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్‌ కేటాయింపులు అరశాతానికే పరిమితమయ్యాయి. వీలైనంత వరకు రిస్క్‌ను తగ్గించి, మెరుగైన, స్థిరమైన రాబడిని అందించే వ్యూహం ఈ పథకం పెట్టుబడుల వెనుక కనిపిస్తోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 28 శాతం కేటాయింపులను ఈ రంగం కంపెనీలకే కేటాయించింది. ఆటోమొబైల్‌ రంగ కంపెనీలకు 14 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలకు 11.46 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)