Breaking News

వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం

Published on Thu, 08/22/2024 - 13:58

న్యూఢిల్లీ: దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్‌ విభాగం సెక్రటరీ అరుణీష్‌ చావ్లా తెలిపారు. పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.

రెండో మెడిటెక్‌ స్టాకథాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.

కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ స్కాన్, డయలాసిస్‌ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్‌ ‘నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీ’కి ఆమోదం తెలపడం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)