Breaking News

SBI: కస్టమర్లకు మరిన్ని సేవలే లక్ష్యం

Published on Fri, 07/05/2024 - 04:50

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్‌ సెల్‌లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి.   కస్టమర్ల బ్యాంకింగ్‌ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్‌ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

→ తన డిజిటల్‌ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. బీహెచ్‌ఐఎం ఎస్‌బీఐ పే యాప్‌లో ట్యాప్‌–అండ్‌–పే, అలాగే యోనో యాప్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎండ్‌–టు–ఎండ్‌ (పూర్తిస్థాయి) డిజిటల్‌ లోన్‌లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్‌లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది.  

→ ఎస్‌బీఐ సూర్య ఘర్‌ లోన్‌ విషయంలో పూర్తి డిజిటలైజేషన్‌ మరో కీలకమైన చొరవగా బ్యాంక్‌ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకం కింద సోలార్‌ రూఫ్‌టాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్‌ఆర్‌ఈ/ఆర్‌ఈసీ పోర్టల్‌లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్‌ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్‌బీఐ డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. 

→ దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్‌... పంజాబ్‌లోని పాటియాలాలో రెండవ గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ సెంటర్‌ (జీఎన్‌సీ) ప్రారంభించింది. ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కు  సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్‌ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్‌ ఎన్‌ఆర్‌ఐ సెంటర్‌ను చైర్మన్‌ దినేష్‌ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్‌లు గ్లోబల్‌ ఇండియన్‌ కమ్యూనిటీతో బ్యాంక్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్‌ హబ్‌లుగా పనిచేస్తాయి. ఎన్‌ఆర్‌ఐ కస్టమర్‌లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ శాఖల నెట్‌వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) 45 ఎక్సే్ఛంజ్‌ హౌస్‌లు,  5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్‌ సన్నద్దమైంది.  

→ న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా  ప్రారంభించింది.  న్యాయవాదులు, న్యాయ నిపుణుల  అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి.  

→ గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్‌ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్‌ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్‌ ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌ నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు  అందుకుంటారు. 

→ వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్‌ వివరించింది.   
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)