Breaking News

డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు

Published on Sat, 08/24/2024 - 05:49

ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు.

 ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్‌బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. 

డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. 

రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు 
ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్‌ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. 

తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్‌)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)