Breaking News

ఎస్‌బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..

Published on Tue, 11/19/2024 - 09:48

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్‌ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్‌ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్‌ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్‌ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్‌(ఓవర్‌ అలాట్‌మెంట్‌)ను ఎంచుకుంది. వెరసి బాండ్‌ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.

ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు

బిడ్‌ చేసిన సంస్థలలో ప్రావిడెంట్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితరాలున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్‌ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్‌బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్‌లుక్‌సహా ఏఏఏ రేటింగ్‌ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)