Breaking News

ఊహించని ఫలితాలు.. దుమ్మురేపిన ఎస్‌బీఐ

Published on Sat, 02/04/2023 - 10:58

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌– డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి.  

ఎన్‌పీఏలు తగ్గాయ్‌
క్యూ3లో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్‌నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 3.2 శాతం జంప్‌చేసి రూ. 544 వద్ద ముగిసింది.

చదవండి: కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్‌ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)