ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త..  ఈ ఏడాది భారీగా కొత్త బ్రాంచ్‌లు

Published on Tue, 08/15/2023 - 08:02

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 300 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా 22,405 శాఖలు ఉన్నాయి. అలాగే, 235 విదేశీ శాఖలు సైతం పనిచేస్తున్నాయి.

ఒకవైపు డిజిటల్‌గా విస్తరిస్తూనే, మరోవైపు అవసరమున్న చోట భౌతికంగా శాఖలను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా తెలిపారు. అలాగే, బిజినెస్‌ కరస్పాడెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు.

‘‘కస్టమర్లకు ఏమి కావాలన్నది మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా వాహకాలను ఏర్పాటు చేసి వారికి  సేవలు అందించే చర్యలు తీసుకుంటున్నాం. మాకు ఇప్పటికే ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఫలితాలను రాబడుతున్నాం’’అని ఖరా ప్రకటించారు. నికర వడ్డీ మార్జిన్‌ గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.5 శాతంగా ఉంటుందన్నారు. జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.16,884 కోట్ల లాభాన్ని ప్రటించడం తెలిసిందే.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)