Breaking News

ఎస్‌బీఐ లాభం రయ్‌

Published on Sat, 11/09/2024 - 05:50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,782 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పాటునిచ్చాయి. స్టాండెలోన్‌ లాభం సైతం రూ. 18,331 కోట్లకు ఎగసింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 14,330 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 5 శాతంపైగా పుంజుకుని రూ. 41,620 కోట్లకు చేరింది. 

రుణాల్లో 15 శాతం వృద్ధి ఇందుకు సహకరించినప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.15% నీరసించి 3.14 శాతానికి పరిమితమయ్యాయి. ఫారెక్స్, ట్రెజరీ మద్దతుతో వడ్డీయేతర ఆదాయం 42% జంప్‌చేసి రూ. 15,721 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1.29 లక్షల కోట్లకు చేరింది. రుణాల్లో 14–16% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్‌  చైర్మన్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. అయితే డిపాజిట్లలో వృద్ధి 10 శాతానికి పరిమితంకావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్‌–సెపె్టంబర్‌) రూ. 63,895 కోట్ల నిర్వహణ లాభం సాధించినట్లు తెలియజేశారు. ఈ బాటలో నికర లాభాల్లోనూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.  

ఎన్‌పీఏలు తగ్గాయ్‌... 
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 3,831 కోట్లకు పరిమితంకాగా.. రూ. 2,300 కోట్ల రికవరీలు అందుకుంది. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.76 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల విషయానికొస్తే జీవిత బీమా విభాగం నికర లాభం ఆరు నెలల్లో రూ. 761 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు జంప్‌చేసింది. క్రెడిట్‌ కార్డుల విభాగం లాభం మాత్రం రూ. 1,196 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు తగ్గింది. ఏఎంసీ నికర లాభం రూ. 940 కోట్ల నుంచి రూ. 1,374 కోట్లకు పెరిగింది. ఇక సాధారణ బీమా సంస్థ లాభం రూ. 60 కోట్ల నుంచి రూ.414 కోట్లకు  ఎగసింది. 

ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర 2 శాతం నష్టంతో రూ.843 వద్ద ముగిసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)