Breaking News

ఎస్‌బీఐ నుంచి మెగా ఐపీఓకు రంగం సిద్ధం

Published on Thu, 07/09/2026 - 11:40

దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్' ఐపీఓకు సర్వం సిద్ధం చేసింది. రూ.11,692.91 కోట్ల అంచనాతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2026 సంవత్సరంలోనే దేశీయ ప్రాథమిక మార్కెట్‌లో భారీ ఐపీఓగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఈ మెగా ఐపీఓకు సంబంధించిన వివరాలు కొన్ని కింద చూద్దాం.

రూ.545 - రూ.574 గా ప్రైస్ బ్యాండ్ ఖరారు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఈ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తన ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.545-రూ.574 గా నిర్ణయించింది. అప్పర్‌ ప్రైస్ బ్యాండ్ వద్ద లెక్కగడితే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.17 లక్షల కోట్లకు చేరనుంది.

అయితే, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతోంది. దీని ద్వారా ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫ్రెష్ ఇష్యూ (తాజా షేర్ల జారీ) లేదు. కాబట్టి, ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ విక్రయించే వాటాదారులకే వెళ్తాయి తప్ప కంపెనీ ఖాతాలోకి చేరవని గమనించాలి.

రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడి ఎంత?

సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ కనీస లాట్ పరిమాణాన్ని 26 షేర్లుగా నిర్ణయించింది. ఒక లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ.574) ప్రకారం రిటైల్ పెట్టుబడిదారునికి కనీసం రూ.14,924 అవసరమవుతాయి. గరిష్టంగా ఇన్వెస్టర్లు 26 షేర్ల మల్టిప్లైస్‌లో మరిన్ని లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు

  • పెట్టుబడిదారుల యాంకర్ బుక్ ఓపెనింగ్ జులై 13.

  • సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం జులై 14.

  • సబ్‌స్క్రిప్షన్ ముగింపు జులై 16.

  • షేర్ల కేటాయింపు ఖరారు జులై 17 (అంచనా).

  • రిఫండ్లు, నిధుల అన్‌బ్లాకింగ్: జులై 20

  • డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: జులై 20

#

Tags : 1

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)