Breaking News

SBI మేనేజర్ జీతం రూ.35 లక్షలా?

Published on Tue, 07/07/2026 - 16:06

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎస్‌బీఐ (SBI) మేనేజర్ ఫారం-16 వైరల్ కావడంతో నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ ఫారం-16లో ఆయన వార్షిక వేతనం రూ.35.24 లక్షలు అని ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ బ్యాంకులో పనిచేసే ఉద్యోగికి ఇంత పెద్ద జీతమా? అనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే.. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతుంది.

వైరల్ అయిన పోస్టు ప్రకారం, ఉద్యోగి ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరి, ప్రస్తుతం స్కేల్-3 మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఫారం-16లో కనిపిస్తున్న రూ.35.24 లక్షలు ఆయనకు ప్రతి నెల వచ్చే జీతం కాదు. అది మొత్తం సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ శాలరీ మాత్రమే.

ఈ గ్రాస్ శాలరీలో ప్రతి నెల వచ్చే జీతంతో పాటు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే.. లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC) ఎన్‌క్యాష్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలిపి ఉన్నాయి. అందుకే మొత్తం జీతం.. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల వచ్చే ఆదాయం మాత్రం కాదని స్పష్టమవుతోంది.

అంతేకాదు, ఫారం-16లో కనిపించే మొత్తం డబ్బు ఉద్యోగి చేతికి కూడా రాదు. ప్రతి నెలా ఆదాయపు పన్ను, ఎన్‌పీఎస్ (NPS), ఈపీఎఫ్ (EPF) వంటి తప్పనిసరి కోతలు ఉంటాయి. వీటితో పాటు హోమ్ లోన్, కారు లోన్, బైక్ లోన్ వంటి నెలవారీ ఈఎంఐలు కూడా జీతం నుంచి కట్ అవుతాయి. కాబట్టి.. బ్యాంకు ఖాతాలో జమయ్యే టేక్ హోమ్ శాలరీ గ్రాస్ శాలరీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.

ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు, ఫారం-16 చూసి మాత్రమే ఎవరి జీతాన్ని అంచనా వేయడం సరైంది కాదు. నిజంగా ఉద్యోగి చేతికి ఎంత వస్తుందో కూడా చూడాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం, ఏమైనా సరే, సంవత్సరానికి రూ.35 లక్షలకు పైగా ప్యాకేజ్ అనేది మంచి జీతమే అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మేనేజర్ ప్రాథమిక వేతనం సుమారు రూ.11-12 లక్షలే అయినప్పటికీ, ఇతర అలవెన్సులు.. ప్రయోజనాలతో కలిపి సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)