Breaking News

ఎస్‌బీఐ లైఫ్‌ లాభం అప్‌

Published on Fri, 01/26/2024 - 05:00

ముంబై: ప్రయివేట్‌ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్‌ ప్రీమియం 17 శాతం జంప్‌చేసి రూ. 17,762 కోట్లను తాకింది.

వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్‌ విలువ(వీఎన్‌బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్‌బీ మార్జిన్‌ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్‌ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్‌ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్‌ కొత్త బిజినెస్‌ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది.  
 ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)