Breaking News

ఎస్‌బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ

Published on Thu, 07/17/2025 - 12:39

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నిధుల సమీకరణకు తెరతీసింది. షేరుకి రూ.811.05 ఫ్లోర్‌ ధరలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)ని చేపట్టింది. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. అయితే ఫ్లోర్‌ ధరకంటే 5 శాతం డిస్కౌంట్‌లో క్విప్‌ను పూర్తి చేసే వీలున్నట్లు తెలియజేసింది. షేరు తాజా ధర రూ. 831.55తో పోలిస్తే ఫ్లోర్‌ ధర సైతం 2.5 శాతం తక్కువకావడం గమనార్హం! వీటికితోడు రుణ సెక్యూరిటీల(బాండ్లు) జారీ ద్వారా మరో రూ. 20,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను ఆఫర్‌ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ.45,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణకు ఎస్‌బీఐ బోర్డ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్‌లో బ్యాంక్‌ వాటాదారులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేశారు. కాగా.. ఎస్‌బీఐ ఇంతక్రితం 2017–18లో క్విప్‌ ద్వారా రూ. 15,000 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే! భవిష్యత్తులో రుణ వృద్ధికి, మూలధన వ్యయానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.


రిలయన్స్‌ సంస్థలు సైతం

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డు వివిధ మార్గాలలో రూ.9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్‌ లేదా క్విబ్‌ తదితరాల ద్వారా రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. 

రిలయన్స్‌ పవర్‌ బోర్డు వివిధ మార్గాలలో రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్‌ లేదా క్విబ్‌ తదితరాల ద్వారా రూ. 6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)