Breaking News

ఎస్‌బీఐ రుణ రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐ భారం

Published on Sat, 07/15/2023 - 08:05

ముంబై: బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం, ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్‌ఆర్‌ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్‌బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం... 

  • ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది. 
  • ఓవర్‌నైట్‌ రేటు 8 శాతంగా ఉంటుంది.  నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి.  
  • ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.45 శాతంగా ఉంటుంది. 
  • రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8.65%కి చేరుతుంది.  
  • మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)