Breaking News

ఎస్‌బీఐ హోమ్‌ లోన్స్‌లో సరికొత్త రికార్డు!

Published on Thu, 08/27/2026 - 00:53

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని దాటనున్నట్లు చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తాజాగా వెల్లడించారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ప్రస్తుత త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో మార్టిగేజ్‌ పోర్ట్‌ఫోలియో ఈ ఫీట్‌ను సాధించే వీలున్నట్లు తెలియజేశారు.

గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఎస్‌బీఐ రూ. 9 లక్షల కోట్ల హోమ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియోను అధిగమించినట్లు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గృహ రుణ విభాగంలో ఎస్‌బీఐ మార్కెట్‌ వాటా 28 శాతంకాగా.. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 460కుపైగా గృహ రుణ ప్రాసెసింగ్‌ కేంద్రాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రొడక్టుల అందుబాటును విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. పారదర్శకత, వడ్డీ రేట్లలో బ్యాంక్‌ విధానాలపట్ల కస్టమర్లకు విశ్వాసమున్నట్లు పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్, బిల్డర్లపై నివేదికలు తదితరాలు కస్టమర్లను బ్యాంకువైపు ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు.

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా..
గృహ రుణాలనేవి కేవలం బ్యాంకింగ్‌ ప్రొడక్టులగానే  చూడకూడదని, వీటివల్ల ఆర్థికపరమైన యాక్టివిటీకితోడు సంబంధిత పలు పరిశ్రమలపైనా సానుకూల ప్రభావం పడుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ శెట్టి వివరించారు. ఆర్థిక వ్యవస్థకు హోమ్‌ లోన్‌ అత్యంత కీలక విభాగమని అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్, కమర్షియల్‌ రియల్టీ రంగంపై 200కుపైగా పరిశ్రమలు ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు.

వెరసి హోమ్‌ లోన్‌ స్టాండెలోన్‌ ప్రొడక్ట్‌గా కాకుండా దేశ ఆర్థిక వృద్ధిలో భాగంగా భావించాలని వ్యాఖ్యానించారు. గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌పై స్పందిస్తూ పరిశ్రమస్థాయిలో రూ. 30 లక్షల కోట్లకుపైగా ఔట్‌స్టాండింగ్‌ రుణాలున్నట్లు తెలియజేశారు. అయితే ఇవి లిక్విడ్‌ ఆస్తులుకావని, దీంతో రీసైకిల్‌ క్యాపిటల్‌ను సమకూర్చుకోవడం, విస్తారిత రుణ మంజూరీ వంటి అంశాలలో బ్యాంకుల అవకాశాలు పరిమితమవుత్నుట్లు వివరించారు. అంతర్జాతీయంగా మారి్టగేజ్‌ బుక్‌ అత్యంత లిక్విడిటీని కలిగి ఉన్నప్పటికీ దేశీయంగా  కొద్దిపాటి సెక్యూరిటైజేషన్‌కు వీలున్నప్పటికీ అత్యధికశాతం ఇల్లిక్విడ్‌ కిందకే వస్తాయని తెలియజేశారు.

#

Tags : 1

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)