Breaking News

హోమ్‌ లోన్‌ మహాన్‌.. ఎస్‌బీఐ

Published on Wed, 12/24/2025 - 11:37

ఎస్‌బీఐ తన గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్‌బీఐ గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్‌లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి వివరించారు.

బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్‌గేజ్‌ రుణదాతగా నిలవడం గమనార్హం.  2024–25లో ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.

2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్‌నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్‌) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)