Breaking News

ఎంటీఎన్‌ఎల్‌ అప్పు ‘మొండి బకాయి..’

Published on Sat, 10/05/2024 - 07:47

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంటీఎన్‌ఎల్‌ రుణ ఖాతాలను సబ్‌–స్టాండర్డ్‌ నాన్‌–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్‌పీఏ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.  సంస్థ జూన్‌ 30 నుండి వాయిదాలు, వడ్డీని చెల్లించనందున ఎస్‌బీఐ ఈ చర్య తీసుకున్నట్లు అప్పుల ఊబిలో ఉన్న  టెలికం సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఎంటీఎన్‌ఎల్‌ రుణ ఖాతాలో మొత్తం బకాయిలు సెపె్టంబర్‌ 30 నాటికి  రూ. 325.52 కోట్లని ఎస్‌బీఐ అక్టోబర్‌ 1న పంపిన లేఖను ఎంటీఎన్‌ఎల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు అందజేసింది. రుణ బకాయిల చెల్లింపుల వైఫల్యం 12 నెలలకన్నా తక్కువ ఉంటే, ఈ పరిస్థితిని సబ్‌–స్టాండర్డ్‌ నాన్‌–పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌గా బ్యాంకుల ప్రకటిస్తాయి. రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యాన్ని ఈ స్థాయి సూచిస్తుంది.

చట్టపరమైన చర్యలకూ సిద్ధం..
రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధమని కూడా ఎస్‌బీఐ సూచించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌సహా బకాయిలను చెల్లించనందుకు అనేక బ్యాంకులు ఎంటీఎన్‌ఎల్‌పై చర్యలు తీసుకున్నాయి. బకాయిలు చెల్లించనందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంటీఎన్‌ఎల్‌ అన్ని ఖాతాలను స్తంభింపజేసింది.

నష్టాల్లో ఉన్న టెలికం సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి మొత్తం రూ. 7,873.52 కోట్ల రుణాలను కలిగి ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ. 31,945 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సావరిన్‌ గ్యారెంటీ బాండ్ల నుండి వచ్చే వడ్డీ చెల్లింపు కోసం ఎంటీఎన్‌ఎల్‌ ప్రభుత్వం నుండి రూ. 1,151.65 కోట్లను కోరింది. ఎంటీఎన్‌ఎల్‌ బాండ్ల ప్రధాన మొత్తం చెల్లింపు కోసం 3,669 కోట్ల రూపాయలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేటాయించింది.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)