Breaking News

SBI క్రెడిట్‌ కార్డులకు కొత్త మార్పులు.. ఛార్జీలు

Published on Thu, 10/02/2025 - 21:29

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొత్త ఛార్జీల విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి క్రెడ్, చెక్ లేదా మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా స్కూల్‌ లేదా కాలేజీ ఫీజులను చెల్లిస్తే, వారు లావాదేవీ మొత్తంలో 1% అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆయా స్కూల్‌ లేదా కాలేజీలు, విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా నేరుగా చెల్లింపు చేస్తే ఎటువంటి రుసుము ఉండదు.

మరో కొత్త ఛార్జీ ఏంటంటే ఎస్‌బీఐ కార్డుదారులు రూ .1,000 కంటే ఎక్కువ మొత్తంతో వాలెట్ లోడ్ చేస్తే, 1% రుసుము వర్తిస్తుంది. ఈ నియమం నెట్ వర్క్ భాగస్వాముల ద్వారా సెట్ చేసిన మర్చంట్ కోడ్ లకు వర్తిస్తుంది. ఈ మార్పు గురించి ఎస్‌బీఐ కార్డుదారులకు ముందుగానే తెలియజేసింది. తద్వారా వారు తమ ఖర్చులను సముచితంగా ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో రూ.500 వరకు లావాదేవీలపై రుసుము ఉండేది కాదు.

ఇక నగదు ఉపసంహరణ రుసుములు, చెక్ చెల్లింపు రుసుములు , ఆలస్య చెల్లింపు రుసుములు వంటి ఇతర సాధారణ ఛార్జీలు మారవు. అయితే, వరసగా రెండు బిల్లింగ్ సైకిల్స్‌లో కనీస నెలవారీ బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైనట్లయితే, ప్రతి సైకిల్ కు అదనంగా రూ.100 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి