ఎస్‌బీఐ కార్డ్‌ క్యూ2 ఫర్వాలేదు

Published on Sat, 10/28/2023 - 05:16

న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డు వ్యాపారంలోని ఎస్‌బీఐ కార్డ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ.603 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.526 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 22 శాతం పెరిగి రూ.4,221 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధి చెంది రూ.1,902 కోట్లకు చేరింది. ఇతర వనరుల రూపేణా ఆదాయం 21 శాతం అధికంగా రూ. 2,186 కోట్లు సమకూరింది.

కంపెనీ రుణ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల రుణాల్లో వసూలు కాని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.43 శాతానికి పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.14 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.78 శాతం నుంచి రూ.0.89 శాతానికి పెరిగాయి. క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో 23.3 శాతంగా ఉంది. సెపె్టంబర్‌ చివరికి నికర విలువ 11,130 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌ చివరికి వినియోగంలో ఉన్న కార్డులు 1.79 కోట్లుగా ఉన్నాయి.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ కార్డ్‌ షేరు 2 శాతానికి పైగా లాభపడి  రూ.791 వద్ద ముగిసింది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)