వృద్ధి 7.5 శాతం: ఎస్‌బీఐ నివేదిక

Published on Fri, 01/09/2026 - 04:35

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు 2025–26లో 7.5 శాతంగా ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తన తొలి ముందస్తు అంచనాల్లో 7.4 శాతం ఉండొచ్చని అంచనా వేయడం తెలిసిందే. ఆర్‌బీఐ అంచనా అయితే 7.3 శాతంగా ఉంది. చారిత్రకంగా చూస్తే ఆర్‌బీఐ, ఎన్‌ఎస్‌వో అంచనాల మధ్య 30–30 బేసిస్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంటుందని, కనుక 7.4 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.

 ‘‘ఎన్‌ఎస్‌వో ద్వితీయ ముందస్తు అంచనాలు, అదనపు డేటా, సవరణలు అన్నవి 2026 ఫిబ్రవరి 27న విడుదల కానున్నాయి. 2022–23ను బేస్‌ సంవత్సరంగా పేర్కొంటే ఈ గణాంకాలన్నీ మార్పునకు గురికావొచ్చు’’అని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. ద్రవ్యలోటు గత నవంబర్‌ చివరికి రూ.9.8 లక్షల కోట్లు (బడ్జెట్‌ అంచనాల్లో 62.3 శాతం)గా ఉండడాన్ని ప్రస్తావించింది. 

2025–26 బడ్జెట్‌లో అంచనాల కంటే పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం అధికంగా ఉందని.. కనుక మొత్తం మీద ఆదాయం ప్రభావితం కాకపోవచ్చని పేర్కొంది. వ్యయాలు కూడా తక్కువగా ఉన్నందున ద్రవ్యలోటు 15.85 లక్షల కోట్లకు పరిమితం కావొచ్చంటూ, బడ్జెట్‌ అంచనా రూ.15.69 లక్షల కోట్ల కంటే ఇది స్వల్ప అధికమేనని గుర్తు చేసింది. ద్రవ్యలోటు 4.4 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.    

Videos

రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..

సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు

అభివృద్ధి ముసుగులో ఊరు పేరు లేని కంపెనీలకు విశాఖను అమ్మేస్తున్నారు

YSRCP నేతలు హౌస్ అరెస్ట్

స్కిల్ స్కాంలో బాబుకు ఎదురుదెబ్బ ?

మెగా ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న హుక్ స్టెప్ సాంగ్

సంక్రాంతి ప్రయాణం.. MGBSలో భారీ రద్దీ..

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. కారుమూరి నాగేశ్వరరావు రియాక్షన్

మైసూరు బోండంలో మైసూరు ఉండదు.. మన రాజధానిలో అమరావతి ఉండదు

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన.. ఆషికా, డింపుల్‌ (ఫొటోలు)

+5

'రాజాసాబ్' గంగాదేవి.. షూటింగ్ జ్ఞాపకాలతో అభిరామి (ఫొటోలు)

+5

క్యాండిల్ లైట్ వెలుగులో 'ధురంధర్' బ్యూటీ గ్లామర్ షో (ఫొటోలు)

+5

ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)

+5

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు (ఫొటోలు)

+5

తెలంగాణ : సంక్రాంతి సంబరాలలో సచివాలయం ఉద్యోగులు (ఫొటోలు)

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)