Breaking News

సేవింగ్స్ అకౌంట్‌ ఉంటే రూ.7,500 క్యాష్‌బ్యాక్!!

Published on Sat, 11/08/2025 - 17:44

రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే, ఈ ఆఫర్ మీకోసమే! ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) తన హ్యాపీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు నెలకు రూ .625 వరకు, సంవత్సరానికి రూ .7,500 వరకు సంపాదించవచ్చు.

క్యాష్ బ్యాక్ ఎలా పొందాలంటే..

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి, మీరు డీసీబీ బ్యాంక్‌లో హ్యాపీ సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తరువాత ఈ ఖాతాలోని మొత్తాన్ని ఉపయోగించి యూపీఐ ద్వారా (డెబిట్ లావాదేవీలు) చేసే చెల్లింపులపై బ్యాంకు ప్రతి త్రైమాసికం లేదా మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్‌ను మీ ఖాతాలో జమచేస్తుంది.

నిబంధనలు, ప్రయోజనాలు

ఖాతాలో కనీసం రూ.10,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించడం తప్పనిసరి.

క్యాష్ బ్యాక్ కు అర్హత సాధించడానికి, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

కనీస లావాదేవీ మొత్తం రూ. 500.

ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ లావాదేవీలు ఉచితం.

డీసీబీ బ్యాంక్ ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలు

యూపీఐ అంటే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీంతె మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు తక్షణం డబ్బును పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాను గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్‌ వంటి యాప్‌లతో అనుసంధానం చేయవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)