Breaking News

అప్పుడు షాక్‌కి గురయ్యా..! ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల..

Published on Thu, 11/02/2023 - 12:33

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్‌లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు.

బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు.

ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్‌ ప్రపంచంలోనే..

ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది.

ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..

1975లో మైక్రోసాఫ్ట్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)