Breaking News

‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’

Published on Thu, 03/27/2025 - 08:41

ముంబై: అందరికీ ఆర్థిక సేవలను మరింత చేరువ చేసే విషయమై నియంత్రణలు అనవసర అడ్డంకులు కల్పించరాదని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వ్యాఖ్యానించారు. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు. విధాన నిర్ణేతలు సైతం తమ చర్యల్లో అత్యుత్సాహం లేకుండా జాగ్రత్త వహించాలని.. చట్టబద్దమైన కార్యక్రమాలను అణచివేసేలా ఉండకూడదన్నారు. కస్టమర్ల హక్కులు, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యహరించాలని సూచించారు.

ఆర్థిక సేవల చేరువలో భారత్‌ ఎంతో ప్రగతి సాధించిందంటూ.. వయోజనుల్లో 94 శాతం మందికి నేడు బ్యాంక్‌ ఖాతా ఉన్న విషయాన్ని గవర్నర్‌ గుర్తు చేశారు. చట్టాలు, నిబంధనలు కేవలం చట్టవిరుద్ధమైన వాటినే లక్ష్యంగా చేసుకోవాలన్నారు. అంతేకానీ, నిజాయితీ పరులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మనీలాండరింగ్‌ (నల్లధన చలామణి), ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థిక వ్యవస్థను భద్రంగా కొనసాగించేందుకు వీలుగా.. విధాన నిర్ణేతలు అత్యుత్సాహ చర్యలకు దూరంగా ఉండాలన్నారు.

ఇదీ చదవండి: ఐటీ షేర్లకు ఏమైంది?

రిస్క్‌ తీసుకునే ధోరణి ఆర్థిక వ్యవస్థకు ఫలితాన్నిస్తుందంటూ.. అదే సమయంలో ప్రజలు, వ్యాపారాలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కస్టమర్లను అదే పనిగా మళ్లీ మళ్లీ కేవైసీ అప్‌డేషన్‌ కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. టెక్నాలజీతో వ్యాపార సులభతర నిర్వహణ మెరుగుపడడమే కాకుండా.. మనీలాండరింగ్, అక్రమ రుణ వ్యాపార మార్గాలకు దారితీసినట్టు చెప్పారు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)