Breaking News

ఐఆర్‌సీటీసీ సీఎండీగా సంజయ్‌ కుమార్‌

Published on Thu, 02/15/2024 - 01:33

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సంజయ్‌ కుమార్‌ జైన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్‌ కుమార్‌ జైన్‌ నార్తర్న్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్‌ కుమార్‌ జైన్‌ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్‌ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్‌ రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సరీ్వసెస్, 1990 బ్యాచ్‌ అధికారి అయిన జైన్, చార్టర్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు.   

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)