'ఫ్యామిలీతో గడుపుతున్నావు.. జీతం తగ్గిస్తున్నాం': షాకిచ్చిన కంపెనీ

Published on Sat, 02/22/2025 - 14:34

రెడ్దిట్ వేదికగా.. చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులో జరిగే సంఘటనలు, అనుభవాలను మాత్రమే కాకుండా సమస్యలను కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగి తమ హెచ్ఆర్ నుంచి వచ్చిన వింతైన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.

''ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితుల కోసం కేటాయిస్తున్నావు. కాబట్టి మీ బాధ్యతలను తగ్గిస్తున్నాము. మీ పోస్ట్ అలాగే ఉంటుంది.  పని తక్కువైంది కాబట్టి.. జీతం తగ్గిస్తున్నాము'' అని హెచ్ఆర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌లో ఉండటం చూడవచ్చు.

ఈ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫిసులలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని చెబుతున్నారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించకపోతే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. కంపెనీ మీకు లేఆఫ్ నోటీసు ఇవ్వకపోవడం మీ అదృష్టం.. అని ఒక వినియోగదారు అన్నారు.

ఆఫీసులలో జరుగుతున్న అకృత్యాలు అంతా.. ఇంతా కాదు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్‌లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.

ఇదీ చదవండి: 'భార‌త్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్

నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్‌లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)