Breaking News

భారంగా మారనున్న స్టీల్‌ దిగుమతులు!?

Published on Sun, 12/22/2024 - 01:11

న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్‌ ఉత్పత్తులు చౌకగా దిగుమతి అవుతున్నాయన్న దేశీ స్టీల్‌ పరిశ్రమ ఫిర్యాదుపై డైరెక్టరేజ్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) అధికారిక దర్యాప్తు మొదలు పెట్టింది.  ఫ్యాబ్రికేషన్, పైపుల తయారీ, నిర్మాణ రంగం, క్యాపిటల్‌ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్‌ ప్యానెళ్ల కోసం వినియోగించే నాన్‌ అలాయ్, అలాయ్‌ స్టీల్‌ ఫ్లాట్‌ ఉత్పత్తులపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు డీజీటీఆర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై 25 శాతం రక్షిత సుంకం విధించాలని ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

ఇటీవల ఉన్నట్టుండి, పెద్ద ఎత్తున పెరిగిన ఈ దిగుమతులతో దేశీ పరిశ్రమకు శారాఘాతంగా మారినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ పరిశ్రమకు తీవ్ర హానికరంగా పేర్కొంది. దరఖాస్తుదారు (స్టీల్‌ పరిశ్రమ) సమర్పించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించేందుకు కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలుట్టు భావిస్తున్నామని డీజీటీఆర్‌ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. హాట్‌ రోల్డ్‌ (హెచ్‌ఆర్‌) కాయిల్స్, షీట్స్‌ అండ్‌ ప్లేట్స్, హెచ్‌ఆర్‌ ప్లేట్‌ మిల్‌ ప్లేట్స్, కోల్డ్‌రోల్డ్‌ (సీఆర్‌) కాయిల్స్‌ అండ్‌ షీట్స్, మెటాలిక్‌ కోటెడ్‌ స్టీల్‌ కాయిల్స్‌ అండ్‌ షీట్స్, కలర్‌ కోటెడ్‌ కాయిల్స్‌ అండ్‌ షీట్స్‌ ఉత్పత్తులు డీజీటీఆర్‌ దర్యాప్తు పరిధిలోకి రానున్నాయి.

విచారణ అనంతరం తన సిఫారసులను కేంద్ర ఆరి్థక శాఖకు డీజీటీఆర్‌ సమరి్పస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా దిగుమతులపై ప్రత్యేక సుంకాలు విధించే అవశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చైనా నుంచి ఈ దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఎనిమిది నెలల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)