Breaking News

వస్తున్నాయ్‌ కొత్త ఐపీవోలు.. కొనుక్కోండి షేర్లు

Published on Wed, 09/17/2025 - 21:32

సోలార్‌ ఫొటొ వోల్టాయిక్‌ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్‌ గ్రీన్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.

ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్‌ సోలార్‌ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఒడిషాలోని గోపాల్‌పూర్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌లో 4 గిగావాట్ల సోలార్‌ పీవీ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్‌30కల్లా 3.8 గిగావాట్ల సోలార్‌ ఫొటొవోల్టాయిక్‌ మాడ్యూల్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్‌ ప్రాజెక్టులకు ఎండ్‌టుఎండ్‌ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.

జీకే ఎనర్జీ @ రూ. 145–153 
సౌర విద్యుత్‌(సోలార్‌ పవర్‌) ఆధారిత వ్యవసాయ నీటి పంప్‌ సిస్టమ్స్‌ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.

ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్‌ పవర్‌ వ్యవసాయ పంప్‌ సిస్టమ్స్‌కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కమిషనింగ్‌(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్‌స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

#

Tags : 1

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)