Breaking News

టారిఫ్‌ల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ వృద్ధి

Published on Tue, 11/25/2025 - 07:44

న్యూఢిల్లీ: భారత్‌ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) వృద్ధి రేటు 6.7 శాతం పుంజుకుంటుందని తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమిస్తుందని, దీంతో వృద్ధి రేటు బలపడుతుందని వివరించింది.

అమెరికా టారిఫ్‌ల ప్రభావం నెలకొన్నప్పటికీ.. బలమైన వినియోగంతో దేశీ వృద్ధి పటిష్టంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. సెపె్టంబర్‌ త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.

అమెరికాతో ఒప్పందం
అమెరికాతో భారత్‌ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అది అనిశ్చితులు తగ్గేందుకు, విశ్వాసం పెరుగుదలకు దారితీస్తుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇది కార్మికుల ఆధారిత రంగాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ‘‘జీఎస్‌టీ రేట్లు తగ్గించడం మధ్య తరగతి వినియోగానికి మద్దతునిస్తుంది. దీనికి ఆదాయపన్ను తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా తోడవుతుంది. ఈ మార్పులతో పెట్టుబడుల కంటే వినియోగం వృద్ధిని బలంగా నడిపిస్తుంది’’అని పేర్కొంది.

గత బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు (కొత్త పన్ను విధానం కింద) కలి్పంచడం తెలిసిందే. ఇక ఆర్‌బీఐ వరుస వడ్డీ రేట్ల తగ్గింపుతో రెపో రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.5 శాతానికి దిగిరావడం గమనార్హం. అలాగే, సెప్టెంబర్‌ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ తగ్గడం తెలిసిందే. భారత ఎగుమతుల విస్తరణపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉందంటూ.. అంతిమంగా భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా తగ్గించే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)