భారత వృద్ధి అంచనాలకు ఎస్‌అండ్‌పీ కోత

Published on Tue, 11/26/2024 - 00:57

న్యూఢిల్లీ: భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తగ్గించింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్‌ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను విడుదల చేసింది. 2025–26లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2026–27) 6.8 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 

ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ గత అంచనాలు వరుసగా 6.9%, 7% చొప్పున ఉండడం గమనార్హం. అంటే 0.2 % మేర తగ్గించినట్టు తెలుస్తోంది. అధిక స్థాయిలో వడ్డీ రేట్లు, పట్టణాల్లో డిమాండ్‌ తగ్గడాన్ని తన తాజా నిర్ణయం వెనుక ప్రధాన అంశాలుగా ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–15) 6.8% వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. 2027–28 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి 7%గా ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది.

 ‘భారత్‌లో జీడీపీ వృద్ధి 2024–25లో 6.8%కి నిదానించొచ్చు. అధిక వడ్డీ రేట్లు, తక్కువ ఆర్థిక ఉద్దీపనలు పట్టణ డిమాండ్‌ను తగ్గించనున్నాయి. అదే సమయంలో పీఎంఐ ఇంకా విస్తరణ దశలోనే ఉంది. ఇతర ముఖ్యమైన ఆర్థిక సూచికలు మాత్రం వృద్ధి నిదానించినట్టు చెబుతున్నాయి’ అని తెలిపింది. మరోవైపు 2024లో చైనా 4.8% వృద్ధి రేటును నమోదు చేస్తుందన్న గత అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కొనసాగించింది. ట్రంప్‌ సర్కారు రూపంలోరానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి చైనా వృద్ధి అంచనాలకు కోత విధించింది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)