Breaking News

భారత్‌ వస్తున్న రష్యా చమురు నౌక యూటర్న్‌!

Published on Wed, 10/29/2025 - 21:42

రష్యా చమురుపై అమెరికా ఆంక్షల నడుమ రష్యా నుంచి ముడి చమురును తీసుకుని భారత్‌ వస్తున్న నౌక అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుంది. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. 'ఫ్యూరియా' అనే ఈ పెద్ద నౌక మంగళవారం డెన్మార్క్, జర్మనీ మధ్య మార్గం ద్వారా భారత్‌ వైపు వెళుతోంది. ఈ ఓడ రష్యా ప్రభుత్వ చమురు సంస్థ రోస్ నెఫ్ట్ విక్రయించిన చమురును తీసుకువెళుతోంది.

రష్యా చమురు కంపెనీలు రోస్ నెఫ్ట్, లుకోయిల్‌లను అమెరికా బ్లాక్ లిస్ట్ చేసిన వారం తర్వాత ఈ యూ-టర్న్ సంఘటన జరిగింది. ఈ రెండు కంపెనీలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 22న ఆంక్షలు విధిస్తూ కంపెనీలు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. ఫ్యూరియా ట్యాంకర్ అక్టోబర్ 20న రష్యాలోని బాల్టిక్ నౌకాశ్రయమైన ప్రిమోర్స్క్ నుండి సుమారు 7,30,000 బ్యారెళ్ల చమురును లోడ్ చేసుకుని బయలుదేరింది. తొలుత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం ఉపయోగిస్తున్న గుజరాత్‌లోని సిక్కా పోర్ట్‌ను ఈ నౌక తన గమ్యస్థానాన్ని ప్రకటించింది. ఈ నౌక నవంబర్ మధ్యలో భారత్‌ చేరుకుంటుందని భావించారు.

తరువాత, నౌక తన గమ్యాన్ని ఈజిప్టులోని పోర్ట్ సైద్‌కు మార్చింది. రష్యా నుండి భారత్‌కు వేగవంతమైన మార్గం సూయజ్ కాలువ గుండా ఉంటుంది. కాబట్టి నౌకలు తరచుగా సూయజ్ కాలువ గుండా వెళ్లే ముందు పోర్ట్ సైద్‌ను తమ గమ్యస్థానంగా ప్రకటిస్తుంటాయి.

అయితే ఈ ఫ్యూరియా నౌక వయస్సు కూడా సమస్య కావొచ్చు. ఫ్యూరియా ట్యాంకర్‌ను ఇప్పటికే యూరోపియన్ యూనియన్, యూకే నిషేధించాయి. ఈ ట్యాంకర్‌కు ఈ ఏడాది 23 ఏళ్లు నిండుతాయి. చమురు ట్యాంకర్ల సాధారణ పరిమితి 18 సంవత్సరాలు. అంతేకాకుండా డెన్మార్క్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు తమ జలాల గుండా వెళుతున్న పాత ట్యాంకర్ల తనిఖీలను ముమ్మరం చేశాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)